కావ్యని భార్యగా అంగీకరించనని తేల్చిచెప్పేసిన రాజ్!
on Jun 5, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -114 లో.. కనకం డబ్బుల కోసం బీరువా చూస్తుంది. ఎంత వెతికినా డబ్బులు కన్పించకపోవడంతో అప్పుని పిలిచి అడుగుతుంది. అప్పుడు అప్పుకి స్వప్న మేకప్ బాక్స్ కోసం ఇచ్చిన డబ్బులు గుర్తొస్తాయి. అప్పు అవే అనుకొని.. ఆ డబ్బులు ఎవరు తీసారో నాకు తెలుసని స్వప్నని తీసుకొని వచ్చి.. మేకప్ బాక్స్ ఆర్డర్ కి ఇచ్చిన డబ్బులు ఎక్కడివని స్వప్నని అడుగుతుంది అప్పు. మా అమ్మ డబ్బులు అని స్వప్న అనగానే.. నీకు అమ్మ ఎక్కడిదే? నా భర్త కష్టపడి సంపాదించిన డబ్బులు దాచుకుంటే.. నువ్వు ఉపయోగించుకుంటావా అని స్వప్నని తిడుతుంది కనకం. నేను దుగ్గిరాల ఇంటికి కాబోయే కోడలిని ఆ ఇంటికి వెళ్ళాక.. మీకు ఎంత కావాలో అంత ఇచ్చేస్తానని స్వప్న పొగరుగా చెప్పేసి వెళ్ళిపోతుంది.
మరొక వైపు కావ్యని అందంగా రెడీ చేస్తుంది ధాన్యలక్ష్మి. నీ తప్పు లేదని రాజ్ కి అర్థం అయింది కదా? ఇప్పుడు రాజ్ నిన్ను భార్యగా ఒప్పుకుంటాడని ధాన్యలక్ష్మి కావ్యని రాజ్ గదిలోకి పంపిస్తుంది. కావ్య పాల గ్లాస్ తో రాజ్ దగ్గరికి వెళ్తుంది. ఏంటీ ఇలా వచ్చావ్? రాహుల్ తప్పు చేసాడని తేలిపోయింది. ఇక నిన్ను భార్యగా ఒప్పుకుంటాడని అనుకున్నావా? నువ్వు ఎప్పటికి నాకు ఇష్టం లేని దానివే.. ఆజన్మశత్రువువే అని రాజ్ అనగానే.. కావ్య బాధపడుతుంది. మీరు ఎప్పటికైనా నన్ను ప్రేమిస్తారని కావ్య అంటుంది. నువ్వు ఎంత వివరణ ఇచ్చినా అది జరగని పని అని రాజ్ అంటాడు. మీరు ప్రేమిస్తారని నేనంటున్నాను.. ప్రేమించనని మీరంటున్నారు చూద్దాం. ముందైతే ఈ పాలు తాగండని రాజ్ తో కావ్య చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. కావ్య వెళ్లగానే తను తీసుకొచ్చిన పాలని డస్ట్ బిన్ లో పారబోస్తాడు. రాజ్ పారబోయడం అటుగా వెళ్తున్న ధాన్యలక్ష్మి చూస్తుంది.
ఆ తర్వాత కళ్యాణ్ దగ్గరికి ధాన్యలక్ష్మి వెళ్తుంది. రాజ్, కావ్యల కాపురం బాగుండాలి. అందుకు మనమే ఏదైనా చెయ్యాలని కళ్యాణ్ తో ధాన్యలక్ష్మి అంటుంది. మరొకవైపు రాజ్ కి అవసరమైన బట్టలన్ని కావ్య రెడీగా పెడుతుంది. రాజ్ స్నానానికి వెళ్తాడు. అప్పుడే నీళ్ల మోటర్ రిపేర్ చేస్తున్నారని వాష్ రూంకి వెళ్ళకండని కావ్యతో పనిమనిషి చెప్పగానే.. రాజ్ కి కావ్య చెప్పే ప్రయత్నం చేస్తుంది. రాజ్ అసలేం వినిపించుకోడు. సర్లే నన్ను ఆటపట్టిస్తారా? మీ సంగతి చెప్తా అంటూ కావ్య అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read